ఆ..
మొదటి సారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంతా
మొదటి సారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టి ద్వేషమంత
మొదటి సారి నీకు ముదుపెట్టినప్పుడు జరిగినంత దోషమంత
చివరిసారి నిజం చెప్పినపుడు తీరినట్టి భారమంతా
ఓఓ.. ఇంకా..
తెల్ల తెల్లవారు పల్లెటూరు లోన అల్లుకున్న వెలుగంత
పిల్ల లేగదూడ నోటికంటుకున్న ఆవు పాల నురగంత
చల్ల బువ్వ లోన నంచుకుంటూ తిన్న ఆవకాయ కారమంత
పెళ్లి ఈడుకోచి తుల్లిఆడుతున్న ఆడపిల్ల కోరికంత
Baby I love you, I love you, I love you so much
Baby I love you, I love you, I love you so much
అందమైన నీ కాలి కింద తిరిగే నేలకున్న బరువంత
నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే నింగి ఉన్న వయసంత
చల్లనైన నీ స్వసలోన తోనిగే గలికున్న గతమంతా
చుర్రుమన్న నీ చూపులోన ఎగిసే నిప్పు లాంటి నిజమంత
Baby I love you, I love you, I love you so much
Baby I love you, I love you, I love you so much
పంతచేలలోని జీవమంత , గంటసాల పాత భావమంత
పండగోచినా పబ్బమోచినా వంటసాలలోని వాసంత
కుంభకర్ణుడి నిద్దరంత , ఆంజనేయుడి ఆయువంత
కృష్ణ మూర్తి లో లీలలంత రామ లాలి అంత
Baby I love you, I love you, I love you so much
Baby I love you, I love you, I love you so much
పచ్చి వేప పుల్ల చేదు అంత , రచ్చబండ పైన వాధనంత
అర్ధమైన కాకపోయినా భక్తి కోది విన్న వేదమంత
ఏటి నీటిలోని జాబిలంత , ఏట ఏట వచ్చే జాతరంత
ఎకపాత్రలో నాటకాలలో నాటు గోలలంత
Baby I love you, I love you, I love you so much
Baby I love you, I love you, I love you so much
అల్లరేకువైతే కన్నతల్లి వేసే మొట్టికాయ చనువంత
జల్లుపడ్డ వేల పొంగి పొంగి పూసే మట్టిపూల విలువంత
బిక్కు బిక్కు మంటూ పరీక్ష రాసే పిల్లగాడి భేదురంత
లక్ష మందిననిన సవాలు చేసే ఆటగాడి పోగారంత
Baby I love you, I love you, I love you so much
Baby I love you, I love you, I love you so much
ఎంత ధగరైన నీకు నాకు మధ్య ఉన అంతులేని దురం అంత
ఎంత చేరువైన నువ్వు నేను కలిసి చేరలేని తిరం అంత
ఎంత ఓర్చుకున నువ్వు నాకు చేసే జ్ఞాపకాలు గాయం అంత
ఎంత గాయం ఐన హాయ్ గానే మార్చే నా తీపి స్నేహం అంత
Baby I love you love you
love you so much
Baby i love you love you
I love you so much